(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో చనిపోవడం దిగ్ర్భాంతిని కలిగించిందని తెలంగాణ జన సమితి పార్టీ సిద్దిపేట జిల్లా కోఆర్డినేటరు తోడుపునురి వేంకటేశం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. నంది ఎల్లయ్య 4 సార్లు సిద్ధిపేట లోక్ సభ ఎంపీగా,2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, నాగర్ కర్నూలు నుండి ఒక సారి ఎంపీగా పనిచేశారని, చాలా నిరాడంబరంగా జీవితాన్ని గడిపారని, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత మైన పదవులు చేసి ఇందిరాగాంధీ నుండి ఇప్పటి సోనియా గాంధీ వరకు విధేయత కలిగి ప్రజల కోసం జీవితాన్ని కొనసాగించారని ఈ సందర్భంగా కొనియాడారు. తన ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటునట్లు ఈ సందర్భంగా తెలిపారు.
0 Comments