నిజామాబాద్ (చట్టం) : ఆగస్టు 9 నుండి 15వ తేది వరకు ఏకం విశ్వశాంతి ఆధ్వర్యంలో విశ్వశాంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీస్ మేకర్ నేతి శ్రీనివాస్ తెలిపారు. తత్వజ్ఞానులు, సిద్దయోగులు ఏకం సృష్టికర్తలు శ్రీ ప్రీతాజి, శ్రీ కృష్ణాజీలు విశ్వశాంతి కోసం విశ్వశాంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఏకం విశ్వశాంతి ఉత్సవంలో జరిగే ఏడు రోజుల ప్రత్యేక సంకల్పాలు:
మొదటి రోజు : దేశాల మధ్య శాంతి నెలకొల్పడం, రెండవ రోజు : పిల్లలలో శాంతి కలగడం, మూడవ రోజు : జాతి, మతాల మధ్య శాంతి, నాల్గవ రోజు: ప్రకృతి, వన్యప్రాణుల శాంతి, ఐదవ రోజు : మహిళలలో శాంతి, ఆరవ రోజు : ఆర్థిక సంవృద్ధి ద్వార కలిగే శాంతి, ఏడవ రోజు : మానవాళి పరిణామంలో శాంతి కొరకు ప్రతిరోజు ఉదయం గం.10.00లకు సాయంత్రం గం.6.00లకు ధ్యానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు విశ్వశాంతి కొరకు పాల్గొనాలని కోరారు.
0 Comments