(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ 60వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, ధర్పల్లి చంద్రం మాట్లాడుతూ రాబోయే కాలంలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో యువతకు అత్యధిక కౌన్సిల్ హాల్ టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా పనిచేస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో యువత పార్టీ విషయాలు అందరికీ ముందుండి నడిపించాలని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిలకు పెద్దపీట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరూ మరువద్దని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువత నడుం బిగించి ముందుకు జరిగి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజ్ వీర్, గ్యాదరి మధు, చిన్న కోడూరు మండల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, నారాయణ రావు పేట మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం, అర్బన్ మండల అధ్యక్షులు రాములు, దాసరి మల్లేశం అశోక్, సాయి, శేఖర్, శ్రీకాంత్, నవీన్, మల్లేశం, భాస్కర్, అజర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments