కరోనాకు ట్యాబ్లెట్స్ వచ్చేశాయ్..

హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కరోనా మందుకు సంబంధించి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా కోవిఫర్ పేరుతో వయల్స్‌‌ను(ఇంజెక్షన్స్) అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ మరో ముందడుగు వేసింది. కరోనాకు మందుగా 'ఫావివిర్' పేరుతో ట్యాబ్సెట్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. 'ఫావిపిరవిర్' అనే యాంటీ వైరల్ డ్రగ్ ట్యాబ్లెట్లకు జెనిరిక్ మందుగా 'ఫావివిర్'ను వినియోగంలోకి తేనున్నట్లు హెటిరో బుధవారం ప్రకటించింది. 'ఫావివిర్' పేరుతో అందుబాటులో రానున్న ఈ కరోనా మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ ధర 59 రూపాయలుగా నిర్ణయించింది. 'ఫావిపిరవిర్' ఉత్పత్తికి, మార్కెటింగ్ చేసుకునేందుకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం కూడా పొందినట్లు హెటిరో స్పష్టం చేసింది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ మెడికల్ దుకాణాల్లో, హాస్పిటల్స్‌లోని మందుల షాపుల్లో 'ఫావివిర్' లభ్యమవుతుందని తెలిపింది. అయితే.. ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఈ ట్యాబ్లెట్లను కొనుక్కునే వీలుంటుందని పేర్కొంది. రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా హెటిరో తీసుకొచ్చిన కరోనా మెడిసిన్ 'కోవిఫర్' 100 మిల్లీగ్రాముల వయల్(ఇంజెక్షన్) ధర రూ.5400గా ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Reactions

Post a Comment

0 Comments