హైదరాబాద్: కరోనా వైరస్ ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకవైపు అయినవారంతా కళ్లముందే కన్నుమూస్తుంటే...మరోవైపు ఆస్పత్రుల ధనదాహానికి కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురికావాల్సి వచ్చింది.
వైరస్ ఎలా సోకిందంటే...
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామానికి చెందిన ఆన్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి (60), భార్య సుకుమారి (55), కుమారుడితో కలిసి చంపాపేటలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. ఆయన సోదరుడి కుమారుడు అడ్వకేట్ అన్‌రెడ్డి హరీష్ రెడ్డి (37) తన భార్యాపిల్లలతో కలిసి ఇదే డివిజన్‌లోని రెడ్డికాలనీలో ఉంటున్నారు. భూ వివాదానికి సంబంధించిన అంశంపై వీరంతా ఇటీవల ఒకే కారులో స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లివచ్చారు. ఆ తర్వాతి మూడురోజులకే అడ్వకేట్ హరీష్‌రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన కోవిడ్ పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఆయన భార్య, ఐదేళ్ల కూతురికి కూడా పాజిటివ్ వచ్చింది. బాబాయ్ సత్యనారాయణ రెడ్డి, పిన్ని సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. జూలై మొదటి వారంలో హరీష్‌రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇన్సూరెన్స్‌పై చికిత్సలు అందించేందుకు వారు నిరాకరించడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 23న మృతి చెందారు. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు వెచ్చించినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు.
ఆ తర్వాత పిన్ని, బాబాయ్...
హరీష్‌రెడ్డికి కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన బాబాయ్ సత్యనారాయణరెడ్డి, పిన్ని సుకుమారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. జూలై 10న వారిద్దరు చికిత్స కోసం తొలుత సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయి హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన రెండ్రోజులకే సత్యనారాయణరెడ్డి తీవ్ర ఆయాసం, జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన్ను చికిత్స కోసం జూలై 15న మళ్లీ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత ఆయన భార్యకు కూడా శ్వాస సమస్యలు తలెత్తాయి. శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా తక్కువగా ఉంది. ఆమెను కూడా డెక్కన్ ఆస్పత్రిలోనే చేర్పించేందుకు కుమారుడు యత్నించాడు. అయితే పడకలు లేవని చెప్పి ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. తెలిసిన వైద్యుడి సహాయంతో ఆమె గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి లో చేరారు. అప్పటికే ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శనివారం బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుంది. పరిస్థితి విషమించి మంగళవారం (28న) ఉదయం మృతి చెందగా, డెక్కన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త సత్యనారాయణరెడ్డి కూడా ఇదేరోజు రాత్రి మృతి చెందారు.

0 Comments