హైదరాబాద్ : తెలంగాణలో కాస్త తగ్గినట్టుగానే కనిపించిన కరోనా కేసులు మళ్లీ గత రెండు, మూడు రోజుల నుంచి వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 58,906కు చేరగా.. ఇదే సమయంలో 12 మంది మృతిచెందారు.. మృతుల సంఖ్య 492కు పెరిగింది. ఇక, ఒకేరోజు 842 మంది కరోనా నుంచి కోలుకోగా... కోలుకున్నవారి సంఖ్య 43,751కు చేరింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663కు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో హోం క్వారంటైన్, హోం అసోలేషన్‌లో ఉన్నవారే 9,178 మందిగా కరోనా బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీలో 509 కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌లో 158, రంగారెడ్డి జిల్లాలో 147, వరంగల్ అర్బన్‌లో 138, సంగారెడ్డి జిల్లాలో 89 కేసులు ఇవాళ అత్యధికంగా నమోదు అయ్యాయి.. 33 జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది.. రికవరీ రేటు దేశ వ్యాప్తంగా 64 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.3 శాతానికి పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.. ఈ రోజు మొత్తం 61 పేజీలతో పూర్తి వివరాలను పేర్కొంటూ.. కరోనా హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.


0 Comments