హైదరాబాద్ (చట్టం) : ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి.. ఇది పూర్తిగా చదవండి కరోనా చికిత్స పై ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ పోస్ట్.
కరోనాకు భయపడకండి.
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు మొదట ధైర్యంగా ఉండాలి.
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్
* ప్యారసిటమాల్-500ఎంజి టాబ్లెట్స్,
* బి-కాంప్లెక్స్,
* సి విటమిన్ ట్యాబ్లెట్స్,
* సిట్రజిన్ ట్యాబ్లెట్స్,
* అంబ్రాక్సిల్ సిరప్ (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)
డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు ప్యారసిటమాల్ ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి. పొడి దగ్గు ఉంటే దగ్గు సిరప్ ను ఉదయం 5ఎంఎల్, రాత్రి 5ఎంఎల్ మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి బి-కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్, ఒకటి సి విటమిన్ ట్యాబ్లెట్స్ మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు.
మెడిసిన్ తో పాటు పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని గార్లింగ్ చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం. ''వీటన్నిటినీ వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే సాధారణ స్ధితికి వచ్చేస్తారు."
వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, సంత్ర వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం .."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన మిశ్రమాన్ని (పౌడర్)ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.
కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి. కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.

0 Comments