సిద్దిపేటలో వికసించిన బ్రహ్మ కమలం..

(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : సూర్యోదయంతో వికసించేది తామర పుష్పం అయితే, చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగింది ఒక్క బ్రహ్మ కమలం మాత్రమే. టిబెట్, దక్షిణ చైనా ప్రాంతాల్లో కనిపించే బ్రహ్మకమలం దక్షిణాది రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో మాత్రమే బ్రహ్మ కమలం పువ్వుగా మారుతుంది. సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్డు ప్రశాంతి నగర్ లో నివాసం ఉంటున్న సుతారి రమేష్ నిర్మల దంపతుల స్వగృహంలో ఉన్న బ్రహ్మకమలం మొక్కకు మొదటిసారిగా మంగళవారం రాత్రి పుష్పం వికసించడంతో పూజలు నిర్వహించారు. అన్ని పూల మొక్కలకు కాండానికి మొగ్గలు ఎదిగి పుష్పాలుగా వికసిస్తే బ్రహ్మకమలం మాత్రం ఆ తీగకు ఉండే ఆకు నుండి ఉద్భవించడం మరో విశేషం. మంగళవారం రాత్రి వికసించిన బ్రహ్మ కమలం బుధవారం ఉదయానికి తిరిగి మొగ్గ దశకు చేరుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా భగవంతుడు సృష్టించిన నీలాగా అభివర్ణిస్తున్నారు.
Reactions

Post a Comment

0 Comments