10 లక్షల రూపాయలతో సి సి రోడ్డు పనులు :58 వ డివిజన్ కార్పొరేటర్ ఎం ఏ ఖుద్దూస్

(నిజామాబాద్ - చట్టం) నిజామాబాద్ నగరంలోని 58 వ డివిజన్ పరిధిలో కాశ్మీ మజీద్ వద్ద 10 లక్షల ఎల్ ఆర్ ఎస్ నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని, టిఆర్ఎస్ నాయకులు సీనియర్ మైనారిటీ లీడర్ 58 వ డివిజన్ కార్పొరేటర్ ఎం ఏ ఖుద్దూస్ తెలిపారు. 58 వ డివిజన్ పరిధిలో లో లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు సి సి రోడ్డు బిటి రోడ్డు డ్రైనేజీ కల్వర్టులు గతంలో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు . 58 వ డివిజన్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలు అన్నా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని మాస్కులు తప్పక ధరించాలని భౌతిక దూరం పాటించాలని అని ప్రజలు తప్పక వాడాలని డివిజన్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు మున్సిపల్ సిబ్బంది ఏ ఈ వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Reactions

Post a Comment

0 Comments