కార్యదర్శి హెల్ప్ లైన్ నంబర్లు రిలీజ్ చేసిన ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

కార్యదర్శి హెల్ప్ లైన్ నంబర్లు రిలీజ్ చేసిన ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్


(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : తెలంగాణలో అన్ని జిల్లాల ఎన్‌ఎస్‌యుఐ కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి,కార్యదర్శి హెల్ప్ లైన్ నంబర్లను ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహ్మద్ అజ్మత్ హెల్ప్ లైన్ మెమొరడం పట్టుకొని మాట్లాడుతూ రాష్ట్రంలో ముక్యంగా సిద్దిపేటలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమానులు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ, ఇష్టాను రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ కరోన సమయంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు మానసిక ఒత్తిడి చేయడం సరికాదు. ఆన్ లైన్ క్లాసుల వల్ల పేద విద్యార్థులు చాలా నష్టపోతారు. కాబట్టి రేపటి నుండి ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు అన్ని పాఠశాలలు తిరుగుతూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలలపై వెళ్లి చర్యలు తీసుకొని ఉన్నత విద్య అధికారుల దృష్టికి తీసుకొని వెలుతాం ఒక వేళ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే ఎక్కువగా ఉన్న కరోన కేసుల ఏరియాల్లో పరీక్షలు నిర్వహించిన ఈ నంబర్స్ కి ఫోన్ చేయగలరు .9908105756, 9652295111, 9177771627. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ పట్టణ అధ్యక్షుడు అమీర్, రోహిత్, సిరాజ్, సర్వర్, ఫైసల్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments