వెంటనే విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి

వెంటనే విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి


- విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడోద్దు
- విద్యారంగ సమస్యలం పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు
- దీక్షను ప్రారంభించిన యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టి యాదగిరి
(చట్టం - సిద్దిపేట /పిట్ల శ్రీనివాస్) : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో విద్యారంగంపై పూర్తి స్పష్టత ఇచ్చి, విద్యా సంవత్సరం ప్రారంభం, హస్టల్స్, గురుకులాలు, యూనివర్శీటీలు నిర్వహణపై ప్రభుత్వం విధాన ప్రకటన చేసి ఏలా ప్రారంభిస్తారో తెలియజేసి విద్యార్ధుల గందరగోళం నుండి బయట పడవేయాలని ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కమిటీ ప్రభుత్వాని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి యాదగిరి జూలై 22న (ఈరోజు) రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతు నిరసన దీక్షలు ఎస్.ఎఫ్.ఐ నిర్వహించింది. ఈ దీక్షలు జరగకుండా కోన్ని జిల్లాలో పోలీసులు నుండి బెదిరింపులు చేశారు. అయినా బెదిరింపులకు లోంగకుండా అన్ని జిల్లాలో నిరసన దీక్షలు విజయవంతం అయ్యాయి. రాష్ట్రంలో మార్చి తర్వాత నుండి లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యారంగంపై సరైన ప్రణాళికలు లేకుంటే ఉంది. రాష్ట్రంలో కేవలం పరీక్షలు రద్దు చేయటం తప్ప విద్యారంగం గురించి కెసిఆర్ ప్రభుత్వం ఆలోచన ఎమి చేయలేదు. అసలే మార్చిలో బడ్జెట్ నిధులు తగ్గింపు, యూనివర్శీటీలలో వైస్ ఛాన్సీలర్ పోస్టులు భర్తీ చేయకపోవటం, హాస్టల్స్ నిర్వహణ సరిగ్గా లేకపోవటం ఉందన్నారు. వీటికీ తోడు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యార్ధులు తరగతులు లేకుండా ఉంటే, ఇంకో ప్రక్క కార్పోరేట్, నారయణ, శ్రీ చైతన్య లాంటి విద్యాసంస్థలు ఆన్ లైన్ తరగతుల పేర వేలాది రూపాయలు ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ విద్యార్ధులకు తరగతులు నిర్వహణ గురించి సరైన ప్రణాళికలు లేవు. రాష్ట్రంలో43 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న వారికి గత 4 నెలలుగా ఎలాంటి మధ్యాహ్నం భోజనం అందటంలేదు. కనీసం వారి ఆహరం గురించి ప్రకటనే లేదు. పైగా కెసిఆర్ ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ విధ్యార్ధులకు ఈ పథకాన్ని ప్రారంబిస్తమంటూ ప్రకటన చేసిన సరైన మార్గదర్శకాలం ఇవ్వలేదు. అందుకే ఈ ప్రభుత్వం అన్ని రంగాలో విఫలం చెందినట్లుగా ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కమిటీ భావిస్తుంది. ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్.ఎఫ్.ఐ. కోరుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం అందించాలి, ఆన్ లైన్ తరగతులు పేర ట్యాబ్లు, ల్యాఫ్ ట్యాఫ్లు, స్మార్ట్ ఫోన్లు కోన్ని పాఠశాలలే అమ్ముతున్నారు. లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రతి విధ్యార్ధి ఇంటీకే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి, కేరళ తరహలోనే టెలివిజన్ ద్వారా తరగతుల జరపాలి. యూజిసి గైడ్ లైన్స్ రాష్ట్రంలో అమలు చేయకుండా అన్ని కోర్సులు విద్యార్ధులను ప్రమోట్ చేయాలి.., పెండింగ్ ఉపకార వేతనాలు, రీయంబర్స్ మెంట్ అందించాలి. విద్యాసంవత్సరం ప్రణాళికలు ప్రారంభించి సిలబస్ తగ్గించి విద్యార్ధులపై భారం తగ్గించాలి. తల్లిదండ్రులు నుండి ఫీజులు వసూళ్లు చేస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలి. పెండింగ్ ఫెలోషిప్, గ్రాంట్స్ విడుదల చేయాలి. ఈ అంశాల ను ప్రభుత్వం పరిష్కారం చేయాలి. లేకుంటే రాష్ట్రంలో విద్యార్ధులతో ఆందోళనలు నిర్వహిస్తాము.. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాసరి ప్రశాంత్ జిల్లా కార్యదర్శి అరవింద్ ఎస్ఎఫ్ఐ నాయకులు సంజీవ్, సాయి, రాకేష్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments