విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేసిన ఎంపిటిసి మద్దుల రాణి మురళి

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేసిన ఎంపిటిసి మద్దుల రాణి మురళి


నిజామాబాద్‌ (‌చట్టం) : నందిపేట మండలం షాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలబాలికలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి మద్దుల రాణిమురళి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌వ్యాప్తి ఉదృతంగా జరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇచ్చిందని, అదే విధంగా చదువుకు దూరం కాకుండా ఉండడానికి పాఠ్యపుస్తకాలు పంపిణి చేస్తూ ప్రభుత్వ చానల్‌ ‌సప్తగిరి ద్వారా ఆన్‌లైన్‌ ‌విద్యను అందిస్తుందని అన్నారు. విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలని దీనికై ప్రణాళికను రూపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు దగ్గర ఉండి పిల్లలకు చదివించాలని దీనికోసం కొంత సమయం కేటాయించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి వహించి పిల్లలు చదువుకునే విధంగా విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో హెచ్ఎం శర్మ, అన్నపూర్ణ, చైర్మన్ భోజన, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింబగౌడ్, జిల్లా విద్యా క్రీడల కార్యదర్శి మద్దుల మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments