చీరాల యువకుడి కుటుంబానికి రూ.10 లక్షలు.. ప్రకటించిన సీఎం జగన్

చీరాల యువకుడి కుటుంబానికి రూ.10 లక్షలు.. ప్రకటించిన సీఎం జగన్

జూలై 19వ తేదీన తన స్నేహితుడు అబ్రహాంతో కలసి బైక్ మీద వస్తుండగా కొత్తపేట చెక్ పోస్టు వద్ద ఓ కానిస్టేబుల్ వారిని ఆపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడానికి వారిని ఆపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్, యువకుల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ సందర్భంగా కానిస్టేబుల్ వారిపై చేయి చేసుకుని, ఆ తర్వాత రూల్స్ గురించి మాట్లాడారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అనంతరం కానిస్టేబుల్ తమ ఎస్ఐ విజయ్ కుమార్‌ను పిలిపించారు. ఇద్దరు యువకులను ఎస్ఐ జీపులోకి నెట్టారు. జీపులో పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా, కిరణ్ పారిపోవడానికి ప్రయత్నించి.. జీపులో నుంచి జంప్ చేశాడని, ఈ సందర్భంగా అతడి తలకు బలమైన గాయమైందని పోలీసులు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రక్తపు మరకలు రోడ్డు మీద ఉన్నాయని, అతడి జుట్టు కూడా అక్కడ లభించిందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. వారిద్దరూ మద్యం తాగి ఉన్నారని పోలీసులు చెప్పారు

చీరాల ఎస్సై విజయకుమార్‌ దాడి చేసిన ఘటనలో కిరణ్‌ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరణించిన కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.

Post a Comment

0 Comments