ప్రజా చైతన్యమై సాగిన మహనీయులు దాశరథి - కవి ఉండ్రాళ్ళ రాజేశం

ప్రజా చైతన్యమై సాగిన మహనీయులు దాశరథి - కవి ఉండ్రాళ్ళ రాజేశం


(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : తెలంగాణ ప్రజల కన్నీళ్లను రచనలుగా మలిచి నిజాం నిరంకుశంపై పోరాటం చేసిన కవి దాశరథి అని కవి ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. దాశరథి జయంతి సందర్భంగా కవులు కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్, ఆదిమూలం చిరంజీవి, రాచకొండ భూపాల్ లతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ ప్రజలపక్షమై నిలిచి, ప్రజా చైతన్యం కొరకు పాటుపడిన దాశరథి బాటలో కవులందరం నడవాలని, తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి దాశరథి అని అన్నారు. అగ్నిధార, రుద్రవీణ, తిమిరంలో సమరం, గాలీబ్ గీతాలు రచనలతో పాటుగా సినిమా పాటలు సైతం రాసి ప్రజల గుండెల్లో నిలిచారు. ప్రజాచైతన్యమై సాగుతున్న దాశరథిని ఖైదీ చేసినా బొగ్గుతో జైలు గొడలపై పద్యాలు రాసి, ఉద్యమస్పూర్తిని చాటాడు. కేంద్ర సాహిత్య పురస్కారం అందుకోవడమే గాకుండా ఆంద్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో దివిటిగా నిలిచి, పద్యాన్ని పదునైన ఆయుధముగా చేసుకుని ప్రజా చైతన్యమై సాగిన దాశరధి కృష్ణమాచార్య స్పూర్తితో ముందుకు సాగాలని కవి రాజేశం అన్నారు.

Post a Comment

0 Comments