(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : మున్సిపల్ కార్మికులును పర్మినెంట్ చేయాలని, కనిసవేతనాలు 24,000రూపాయలు నిర్ణయం చేయాలని సీఐటీయూ డిమాండ్ జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్ కుమార్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాస్కులు, గ్లౌజులు, వృత్తి పరికరాలు, సానిటైజర్ పూర్తిగా ఇవ్వడంలో లోపంగా ఉందని, ఆదివారం సెలవు అమలు చెయ్యడం లేదని, కార్మికులపై వేధింపులు, పనిగంటలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యమంత్రి గిఫ్ట్ 5000 రూపాయలు పూర్తి స్థాయిలో అన్ని రకాల కార్మికులు 6 నెలల పాటు ఇవ్వాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేస్తుంటే అక్రమంగా 42 మంది సిద్దిపేట మున్సిపల్ కార్మికులును తొలగించడం జరిగింది. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. చేర్యాల మున్సిపల్ కార్మికుల కు నేటికి జీఓ 14ప్రకారం వేతనాలు అమలు చేయడం లేదు. మున్సిపల్ కార్మికులకు కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు నర్సింలు, చెంద్రం, బాబు, పార్శారములు, సంతోష్, ప్రభాకర్, శ్రీరామ్, వినోద, లక్ష్మి, ఎల్లవ్వ, పద్మ, నర్సవ్వ, తదితరులు పాల్గొన్నారు.

0 Comments