తల్లిని చూసి తల్లడిల్లిన తనయుడు

తల్లిని చూసి తల్లడిల్లిన తనయుడు


పాలస్తీనా : తల్లి నరకయాతన పడుతుంటే కొడుకు చూస్తూ ఏమి చేయలేని దయనీయ స్థితి. కొడుకు మనస్సు తల్లడిల్లుతున్నా తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా నేను ఉన్నాను, నీ కేం కాదు అని ధైర్యం చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితి. తల్లిని బ్రతికించుకోవాలనుకున్నా నిస్సహాయస్థితిలో ఏమి చేయలేక పోయాడు. ఎందుకంటే ఆమెను కరోనా కబలించి వేస్తుంది. దగ్గరకు వెళ్లి ఓదార్చలేని నిస్సహాయ స్థితి... ఏం చేయాలో తెలియక ప్రతి రోజు రాత్రి ఆసుపత్రిలోని గదికి ఉన్న కిటికి ఎక్కి కూర్చొని తన తల్లిని చూసేవాడు. ఆమె ప్రాణాలు వదిలే వరకు అలానే చూసుకున్నాడు. పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించి ఫోటోను ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత ప్రతినిధి మహ్మద్‌ ‌సఫా ట్వీటర్‌లో షేర్‌ ‌చేశాడు.

Post a Comment

0 Comments