నిజామాబాద్ (చట్టం) : ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని పెద్ద చెరువులో మొసలి కనిపించింది. ఊరి పక్కనే ఉన్న పెద్ద చెరువులో స్థానిక జాలరులు చేపలు పట్టడానికి వెళ్లి మొసలిని చూసి భయాందోళనకు గురై గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా వెళ్లి చూడగా వారి కళ్ల ముందరే నీటిలోకి జారుకుంది. మొసలిని చూసిన రైతులు, జాలర్లు భయపడుతూ సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించి మొసలిని పట్టుకోవాలని సూచించారు.

0 Comments