హైదరాబాద్ (చట్టం) : వైసీపీలో కొంతమంది తనని మోసం చేశారంటూ.. మాలమహానాడు వైసీపీ విభాగం అధ్యక్షురాలు బొల్లుపల్లి జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్ట్ ల ముందే విషం తాగేశారు. వెంటనే ఆమెను జర్నలిస్ట్ లు పోలీసుల సాయంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారని జోని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం లేదని.. ఈ విషయంపై పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకు అసలు స్పందించలేదన్నారు. వైస్సార్సీపీ పార్టీని సొంత కుటుంబంలా భావిస్తే పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనని మోసం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు. జోని కుమారి ఆత్మహత్యాయత్నం వైసీపీలో కలకలం రేపింది.
https://youtu.be/un-Dwy9seys

0 Comments