గర్భవతులు, బాలింతలు సహా 36 నెలలోపున్న శిశువులను ఒక విధంగా, 36 నుంచి 72నెలల వరకున్న చిన్నారులను మరో విధంగా చూడాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీలోని పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, సహా ప్రత్యేక పుస్తకాలను అందించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే నాణ్యత ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ -2లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , దీనిపై సమగ్రంగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. సిలబస్‌పైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
0 Comments