లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను కొందరు బేఖాతరు చేస్తుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొద్దిమంది నిర్లక్ష్యం కారణంగా మొత్తం సమాజానికి ముప్పు వాటిల్లనున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. విపత్తు యాజమాన్య చట్టం, ఐపీసీ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ సవివరమైన జాబితాను రాష్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పంపించింది.
#IndiaFightsCorona
Reactions

Post a Comment

0 Comments