బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ PM-CARES సహాయ నిధికి ఎంపీ ల్యాండ్స్ నుండి కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరోనా నివారణకు చేపట్టే కార్యక్రమాలకు వినియోగించడానికి 50 లక్షలు ప్రకటించారు. వాటితో పాటు ఇవాళ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా తనవంతు సహాయం చేసి ఉదారత చాటారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. బిజెపి తెలంగాణ కార్యకర్తలు, అభిమానులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు PM-CARES సహాయ నిధికి భారీగా విరాళాలు అందించడం ఆనందంగా ఉందని, సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశం కంటికి కనిపించని కరోనా వైరస్ తో పోరాటం చేస్తుందని, దాని నివారణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్ డౌన్ ను తప్పకుండా పాటించాలన్నారు.
ఇక తన పిలుపునకు ముందుకు వచ్చి 10 లక్షల రూపాయలను విరాళంగా అందించిన బిజెపి నేత నేత మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మరిని తరిమేద్దాం - దేశాన్ని గెలిపిద్దాం అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక సంకల్పంతో లాక్ డౌన్ ను పాటిస్తూ ఇంట్లోనే ఉండి దేశఐక్యతను చాటాలని బండి సంజయ్ అన్నారు
#IndiaFightsCorona #TSDonates2PMCARES
0 Comments