నిజామాబాద్ (చట్టం): నిజామాబాద్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన రిమాండ్ ఖైదీ తుపాకీతో తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్ కు చెందిన ప్రసాద్ ను ఇటీవల దొంగతనం కేసులో మాక్లూర్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో సారంగాపూర్ జైలుకు తరలించారు. అయితే నిన్న అనారోగ్యానికి గురవడంతో అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఖైదీ ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసి హాండ్ కప్స్ ఉండగానే షార్ట్ వెపన్ తుపాకీ తో పారిపోయాడు. సిబ్బంది సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. పారిపోయిన ఖైదీ కోసం గాలింపు చేపట్టారు.

0 Comments