కరోనాపై పోరుకు రూ.2 కోట్ల విరాళం: పవన్ కల్యాణ్ గారు

కరోనాపై పోరుకు రూ.2 కోట్ల విరాళం: పవన్ కల్యాణ్ గారు



  •  పి.ఎమ్.కేర్స్ కు రూ.కోటి *
  • ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరి రూ.50 లక్షలు

 కరీనా మహమ్మారిపై పోరాటానికి ప్రధానమంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.2 కోట్ల విరాళం ప్రకటించి తన వదాన్యతను దాటుకొన్న జనసేన అద్యకులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎందరికో స్ఫూర్తినిచ్చారు.

 ఆ విరాళాన్ని ఎలాంటి హడావిడి లేకుండా బ్యాంక్ ద్వారా బదలాయించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. అందుకు తగిన ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ ముఖ్య ప్రతినిధులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆ విరాళాన్ని సంబంధిత ఖాతాలకు పంపే ప్రక్రియను పూర్తి చేశారు. ప్రధానమంత్రి సహాయనిధికిగాను పి.ఎమ్.కేర్స్ నిధికి రూ. కోటి విరాళం పంపించారు.

అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు సంబంధిత ఖాతాలకు ఆ విరాళాలను బదిలీ చేశారు. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య సేవలు, ఇతర సేవలకు నిధులు అవసరం. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలి. కరీనాపై పోరులో భాగంగా ప్రతి ఒక్క భారతీయుడు దేశం కోసం రూ.100 ఆపైన తమ శక్తి కొద్దీ పి.ఎమ్.కేర్స్ కు విరాళం ఇవ్వాలని... ఇంకో పది మంది విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments