దీపం వెలిగిద్దాం.. ఐక్యత చాటుదాం: చెర్రీ వీడియో సందేశం

దీపం వెలిగిద్దాం.. ఐక్యత చాటుదాం: చెర్రీ వీడియో సందేశం

తాజాగా హీరో రామ్ చరణ్ మన ఐక్యతను చాటుకునేందుకు ఇదే మంచి సమయం అంటూ ప్రధాని పిలుపుకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.

‘ అందరికీ నమస్కారం.. రేపు (ఆదివారం) రాత్రి 9 గంటలకి మన ఇళ్లల్లో అన్ని లైట్స్ ఆర్పేసి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం. ప్రధానమంత్రిగారి మాటను గౌరవిద్దాం.. కరోనా లేని భారతదేశాన్ని తప్పకుండా సాధిద్దాం’ అంటూ వీడియో సందేశం ద్వారా ట్వీట్ చేశారు రామ్ చరణ్. ఇక లాక్ డౌన్‌ని పాటిస్తున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్. ‘నేను చాలా గర్వపడుతున్నాను కరోనా వ్యాప్తిని అరికట్టడంతో ప్రధాని నిర్ణయానికి లోబడి అందరూ లాక్ డౌన్‌‌‌ను పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే స్పూర్తితో రేపు దీపాలు వెలిగిద్దాం.. దయచేసి మరిచిపోవద్దు’ అంటూ పిలుపునిచ్చారు రామ్ చరణ్.

Post a Comment

0 Comments