Pragathi Bhavan: ముఖ్యమంత్రి కుటుంబం సహా మంత్రులు, ఉన్నతాధికారులు
ప్రగతి భవన్‌లో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనాపై పోరాటంలో భాగంగా దేశమంతా ప్రధాని మోదీ పిలుపునకు ప్రజలు కదిలివచ్చారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించారు. తెలంగాణలో రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కొవ్వొత్తులను 9 నిమిషాల పాటు ప్రదర్శించి ఐక్యతను చాటారు.
ఇటు ప్రగతి భవన్‌లోనూ సీఎం కేసీఆర్ కొవ్వొత్తి ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబం సహా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌లో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ సంతోశ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర సిబ్బంది తదితరులు కొవ్వొత్తులను ప్రదర్శించారు. కరోనాపై పోరులో భాగంగా తన ఇంట్లో మంత్రి హరీశ్ రావు కొవ్వొత్తులు వెలిగించారు. కుటుంబ సమేతంగా ఆయన ఈ దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 Comments