-యాజమానిపై కేసు నమోదు చేసిన అధికారులు
నిజామాబాద్ (చట్టం) : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ ఎంఎస్ నం.45 ప్రకారం ద ఎపిడోమిక్ యాక్ట్ 1897కు విరుద్దంగా వ్యవహరిస్తూ నిత్యవసర వస్తువులు అత్యదిక ధరలకు విక్రయిస్తున్న సూపర్ మార్కెట్‌ను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసి యజమానిపై 1వ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ దక్షిణ మండల పరిదిలోని బోధన్ రోడ్డులోగల జెకె.సూపర్ మార్కెట్ (హోల్‌సెల్ అండ్ కిరాణం) షాపులో నిత్యవసర వస్తువుల ధరలను అధిక ధరలకు అమ్ముతున్నారని కరోనా కంట్రోల్ రూంకు ఫిర్యాదు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సంబందిత శాఖ అధికారులకు ఆదేశించారు.
జిల్లా ఇంచార్జీ పౌరసరఫాల అధికారి సి.వెంటేశ్వర్‌రావు నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీస్ శాఖ, సంయుక్తంగా జెకె సూపర్ మార్కెట్‌ను సందర్శించి విచారణ చేపట్టారు. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్నారన్న విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. అదే విదంగా షాపు యజమాని మొహమ్మద్ సులేమాన్ నిత్యవసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్న నేరం కింద 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
జిల్లాలో ఎవరైనా హోల్‌సెల్ కిరాణా షాపుదారులు నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విచారణలో 1వ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు, డిప్యూటి తహసిల్దార్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) బి.విజయకాంత్ రావు, డి.వసంత్ రావు, కె.శ్వేత పాల్గొన్నారు.

0 Comments