నిజామాబాద్‌లో ధన్‌పాల్‌ ‌సూరన్న కరోనా సహాయం



నిజామాబాద్‌ (‌చట్టం) : రెక్కాడితోకాని డొక్కాడని కూలీలను గుర్తించి ధన్‌పాల్‌ ‌లక్ష్మీబాయి మిట్టల్‌ ‌గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గుప్త  ఉచిత భోజనం అందించారు. నగరంలోని 35వ డివిజన్‌లో స్థానిక కార్పోరేటర్‌ ఎ‌ర్రం సుధీర్‌, ‌బిజెవైఎం నాయకులు అమంద్‌ ‌విజయ్‌ ‌కృష్ణ కోరిక మేరకు రోజువారి కూలీ పని చేసుకునే వారిని గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంతో రోజూవారి కూలీ పని దొరకక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అటువంటి వారి బాధలను గుర్తించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ ‌సూరన్న వీరికి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. అదే విధంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10రోజుల పాటు ఉచిత భోజనం అదిస్తానని తెలియజేశారు

Reactions

Post a Comment

0 Comments