‌ప్రభుత్వ రుణం తీర్చుకున్న యువకుడిని అభినందించిన మంత్రి కేటిఆర్‌

‌ప్రభుత్వ రుణం తీర్చుకున్న యువకుడిని అభినందించిన మంత్రి కేటిఆర్‌


హైదరాబాద్‌ (‌చట్టం) : ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఓవర్‌సీస్‌ ‌స్కాలర్‌షిప్‌స్ ‌పథకం పేద విద్యార్థులకు వరంగా మారింది. ఓవర్‌సీస్‌ ‌స్కాలర్‌షిప్‌ అం‌దుకొని ఉన్నత స్థితికి చేరుకున్న యువకుడు ప్రస్తుతం కరోనాపై పోరాటానికి తనవంతుగా ప్రభుత్వానికి సాయం చేసినందుకు మంత్రి కేటిఆర్‌ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన సాయానికి గొప్ప మనసుతో కృతజ్ఞతలు చూపిన శ్రీకాంత్‌ అనే యువకుడికి ఆయన ధన్యవాధాలు తెలిపారు.
'నా పేరు శ్రీకాంత్‌ శరవణ్‌. మా నాన్న ఆటో డ్రైవర్‌. నేను ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. కానీ, తన ఒక్కడి సంపాదన, మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది వీలుకాదని బాధపడుతుండేవారు. ఉన్నత చదువుల కోసం సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ అందించి ఆదుకుంది. ఇప్పుడు నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను ఆదుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం ఎంతో కొంత సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనాపై పోరాటానికి నా వంతు సాయంగా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం అందించాను.' అని మంత్రి కేటీఆర్‌కు శ్రీకాంత్‌ ట్వీట్‌ చేశాడు. అలాగే, సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50వేలు సాయం చేసినట్లు ధ్రువీకరించే పత్రాన్ని కూడా జతచేశాడు.

Post a Comment

0 Comments