వలస కూలీల సమస్యపై సుప్రింకోర్టులో పిటీషన్‌

వలస కూలీల సమస్యపై సుప్రింకోర్టులో పిటీషన్‌

:
కరోనా వైరస్‌ ‌వైరస్‌ ‌వ్యాప్తి అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో ఏఆధారం లేని వలస కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మహానగరాలలో అయితే పరస్థితి మరి దారుణంగా మారింది. పొట్ట చేతబట్టి పని కోసం మహానగరాలకు వచ్చిన కూలీలు, లాక్‌ ‌డౌన్‌ అమలు నేపధ్యంలో పనులు లేక పస్తులు ఉండలేక స్వస్థలాలకు నడక బాట పట్టారు. వీరి దుస్థితి దయనీయ స్థితిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటీష‌న్ స్వీక‌రించింది. అడ్వ‌కేటు ఆలోక్ శ్రీవాత్స‌వ్ వేసిన ఆ పిటీష‌న్‌పై కోర్టు వాద‌న‌లు విన్న‌ది. వ‌ల‌స కూలీల‌కు ఆహారం, నీరు, ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ శ్రీవాత్స‌వ‌న్ త‌న పిటిష‌న్‌లో కోరారు. కాలిన‌డ‌కన ఇండ్ల‌కు వెళ్తున్న‌వారికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీవాత్స‌వ్ సూచించారు. అయితే ఈ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేప‌ట్టింది.

వ‌ల‌స కూలీల‌ వ్య‌ధ‌ల‌ను దూరం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా.. సుప్రీంకోర్టుకు వెల్ల‌డించారు. అడ్వ‌కేట్ శ్రీవాత్స‌వ్ పిటిష‌న్‌కు తాను అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌నుకుంటున్న‌ట్లు కోర్టుకు తుషార్ తెలియ‌జేశారు. దీనిపై సీజేఐ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం స్పందించింది. వ‌ల‌స కూలీల క్షేమం కోసం కేంద్రం ఏం చేస్తుందో తెలుసుకోవాల‌ని సీజే అన్నారు.

Post a Comment

0 Comments