త్వరలో పదోతరగతి పరీక్ష తేదీలను ప్రకటిస్తాం

త్వరలో పదోతరగతి పరీక్ష తేదీలను ప్రకటిస్తాం


హైదరాబాద్‌ (‌చట్టం) : హైకోర్టు ఆదేశాలతో ఆగిపోయిన పదో తరగతి పరీక్షలకు సంబందించిన తేదిలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపద్యంలో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు కేవలం 21 వరకు మాత్రమే జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 22 జనతా కర్ఫ్యూ ప్రకటించగా అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ ‌నెల 31 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించారు. తాజాగా 24వ తేదిన రాత్రి 12గంటల నుండి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంతో పరీక్షల తేదిని మరోసారి ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ‌ప్రకటించారు.

Post a Comment

0 Comments