నిజామాబాద్‌ ‌కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం : ఎంపి అర్వింద్‌ ‌ధర్మపురి

నిజామాబాద్‌ ‌కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం : ఎంపి అర్వింద్‌ ‌ధర్మపురి

నిజామాబాద్‌ ( ‌చట్టం న్యూస్‌) : నిజామాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎం ను కూర్చోబెట్టేందుకు తెరాస ప్రయత్నం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్న డివిజన్లలో తెరాస డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని  తద్వారా మేయర్ పీఠాన్ని అప్పజెప్పేందుకు నిర్ణయించిందన్నారు.
కేటీఆర్ రాజకీయ నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ, అమిత్ షా లను విమర్శించే అర్హత అతనికి లేదన్నారు. తెలంగాణ సాధించి చరిత్ర సృష్టించిన కేసీఆర్ ను  కేటీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసి చరిత్ర హీనుడ్ని చేస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లును తెలంగాణలో అమలు చేయమని హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ ను భాజపా కైవసం చేసుకుంటుందని గెలిచిన తర్వాత నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చేందుకు మొదటి సంతకం చేస్తామని ప్రకటించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చానని దీనిపై మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమేనని ధ్రువీకరించిన అర్వింద్ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల మానిఫెస్టోను అర్వింద్ విడుదల చేశారు.

Post a Comment

0 Comments