నిజామాబాద్ (చట్టం న్యూస్) : ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ 17, 40 గౌతమ్ నగర్, 41, 42, చంద్ర శేఖర్ కాలనిలోని 16, 38, దుబ్బ చౌరస్తా 19, 20 కంటేశ్వర్ లో కుర్మా ఫంక్షన్ హల్ లో టిఆర్‌ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నాడు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్తున్నాయని ప్రజలు అందరు సంతోషంగా ఉన్నారని దీనికి అంతటికీ కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని కేసీఆర్ తెలంగాణను అగ్ర స్థానంలో నడిపిస్తున్నాడు కాబట్టి మీరు వేసే ఓటు కార్పొరేటర్ అభ్యర్థి కి కాకుండా నేరుగా కేసీఆర్ కి చెందుతుందని, మీ యొక్క ఓటు ఆలోచించి మీకోసం మీ డివిజన్ అభివృద్ధి కోసం అయిన మీ ఓటు కారు గుర్తుకు వేయాలని కోరారు.
ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్లినపుడు పెద్ద మనుషులు కేసీఆర్ పుణ్యన వారి గౌరవం పెరిగిందని చెబుతున్నారు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్ 2016 రూపాయల ద్వారా ఇంట్లో విలువ ఇవ్వని కొడుకు, కోడలు, దగ్గరికి రాణి మనవాళ్లు, మన్వరాలు ఈరోజు కేసీఆర్ ఇచ్చే ఈ ఒక పెంచన్ ద్వారా మాకు గుర్తింపు పెరిగిందని తెలియజేస్తున్నారు.
ప్రతి డివిజన్ల లో జరుగుతున్న పబ్లిక్ మీటింగులు రోడ్లు పైన పెడుతుంటే ఆ రోడ్లు వేసింది టిఆర్‌ఎస్ గవర్నమెంట్ అని గర్వంగా చెప్పగలుగుతున్నాం, ప్రతి డివిజన్ల లో రోడ్లు, డ్రైనేజీలు, ఎల్‌ఈడి లైట్లు, ఇంటింటికి నీరు, ఇలా ప్రతి డివిజన్లను అభివృద్ధి పరిచ అని తెలిపారు.
ఆడపిల్ల పుడితే బాధ పడకూడదు అని కేసీఆర్ ఆడపిల్లల కోసం పాప పుడితే 13000 రూపాయలు కేసీఆర్ కిట్టు అందులో తల్లీ కి 2 చీరలు, బిడ్డకు దుస్తులు, జాన్సన్ బేబీ ప్రొడక్ట్స్ తలకి నూనె, సబ్బు, పౌడర్, గిలక, టవల్, టోపి ఇలా కేసీఆర్ కిట్టులో అమర్చి ఇవ్వడం జరుగుతుంది.
పిల్లల చదువుకై గురుకుల, మైనారిటీ స్కూళ్ళు, వారి కొరకు 1 లక్ష 25 వేల రూపాయలు కేటాయించడంతో పాటు వారికి స్కూళ్లలో దుస్తులు, షూలు, ఉండటానికి హాస్టల్, మంచి భోజనం ఇలా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసిందని, ఈరోజుల్లో పేద వారికి ఆడపిల్ల పెళ్ళి కష్టం కాకూడదని పెళ్లి కొరకు 1,00,116/- రూపాయలు కళ్యాణ లక్ష్మీగా అందిస్తుంది దానితో పాటు పెళ్లి కూతురికి కానుకగా ఒక చీర, పెళ్లి కొడుకుకి ఒక డ్రెస్ నా సొంత డబ్బులతో పెళ్లి కానుకగా ఇస్తున్నానని తెలిపారు.
ఇలా ప్రతి డివిజన్ల లో టిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి ని గురించి తెలియజేసి కచ్చితంగా కారు గుర్తుకి ఓటు వేసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వినపించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటరు అభ్యర్థులు 17 మాయవర్ సవిత, 40 మాయవర్ సాయిరాం, 41 చాంగ్ భాయ్, 42 కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి, 16 పంచారెడ్డి సురేష్, 38 సహదేవ్ టిఆర్‌ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సూదం రవిచందర్, మాదని శ్రీధర్ తదితరులు కార్యకర్తలు
0 Comments