నిజామాబాద్ ( చట్టం న్యూస్) : 23వ డివిజన్‌ను ప్రణాళిక బద్దంగా అభివృద్ది చేయడానికి ఎన్నికల బరిలో బిజెపి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మల్లేష్ యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.
కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్‌లో ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. నిస్వార్థ సేవకుడు ప్రజల మనిషి గతంలో కౌన్సిలర్‌గా అభివృద్ది చేసిన వ్యక్తి అని అన్నారు. డివిజన్ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు.
మీరు వేసే ఒక్కో ఓటు అభివృద్ది కోసమని గ్రహించాలన్నారు. గతానికి భిన్నంగా డివిజన్‌లో అభివృద్ది చేసి ప్రజల సమస్యలు తీర్చే ప్రజా సేవకుడు మల్లేష్ యాదవ్ అని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులపాల్గొన్నారు.

0 Comments