వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద వరసగా నాలుగో ఏడాది 50,10,275 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విడతగా రూ. 3,758 కోట్ల పెట్టుబడి సాయం అందజేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి సీఎం జగన్మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేశారు.
For Telugu Jokes : https://www.geekyteluguworld.com/category/telugu-funny-quotes/
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఖరీఫ్ పనులు మొదలు కాక ముందే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని గుర్తు చేశారు. తొలివిడత పెట్టుబడి సాయం కింద రూ. 7,500 అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,500 అందజేస్తోందని.. ఈ నెలాఖరు కల్లా కేంద్ర ప్రభుత్వం పీఎం- కిసాన్ పథకం కింద రూ. 2,000 అందజేస్తుందని చెప్పారు.
For Motivational Quotes :https://www.geekyteluguworld.com/category/inspirational-quotes-in-telugu/
గత ప్రభుత్వంలో రైతులను గాలికి వదిలేశారని సీఎం జగన్ తెలిపారు. తాము వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చివేసినట్లు చెప్పారు. అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత చంద్రబాబు హయాంలో రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేస్తూ ఈ దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రైతులు ఎంతో మేలు చేస్తున్న తమపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు.
For Love Quotes : https://www.geekyteluguworld.com/category/love-quotes-in-telugu/
0 Comments