విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశం.అలా జరగనివ్వం..


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వారితో చర్చించారు. ప్రభుత్వం తరపున కేంద్రంపై ఒత్తిడి తేవాలని నేతలు కోరారు.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. సీఎంకు మూడు పేజీల వినతి పత్రాన్ని అందజేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగబోదని జగన్ హామీ ఇచ్చారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి మాటపై తమకు నమ్మకం ఉందని.. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అందరూ కలిసికట్టుగా పోరాడతామన్నారు.
Reactions

Post a Comment

0 Comments