తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటిస్తున్న సమయంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మంత్రి కేటీఆర్ పర్యటనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనం ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని రైతు సమస్యల మీద నిలదీశారు. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలంటూ మెరుపు ధర్నా చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బందోబస్తు చర్యలుచేపట్టినా కూడా బీజేపీ కార్యకర్తలు ఆకస్మికంగా ప్రత్యక్షం కావడంతో టీఆర్ఎస్ నేతలు పోలీసులు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పోలీసుల భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది
0 Comments