డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయనున్న కేటీఆర్‌



రాష్ట్ర పేద ప్రజలకు శుభవార్త. డబుల్‌ బెడ్‌రూం పథకం కింద ఇళ్ల పంపిణీ​కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్‌ సోమవారం పంపిణీ చేయనున్నారు. జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్‌లో 192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి ఈరోజు పంపిణీ​ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆయా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇళ్లను కూడా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. 

Reactions

Post a Comment

0 Comments