సమగ్ర భూసర్వేపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు


వచ్చే ఏడాది జనవరి 1న సమగ్ర భూసర్వే మొదలు కావాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని.. దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్‌ అవుతుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.


డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్‌ ద్వారా ఫోటో తీస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో జనవరి 2023 నాటికి పూర్తవుతుందని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు దశల్లో సర్వే కొనసాగుతుందని వివరించారు. సమగ్ర భూసర్వే కోసం 70 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్(బేస్‌ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్నింటిని ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్‌ కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు కూడా ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

Reactions

Post a Comment

0 Comments