రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక కరువు భత్యం(డీఏ)ను వెంటనే చెల్లిం చాలని ఆర్థికశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. డీఏ విషయంలో ప్రస్తుత విధానాన్ని మార్చా లన్నారు. ‘ప్రస్తుతం డీఏ ఎంతనే విష యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అను సరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డీఏల విష యంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రక టించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకా యిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగు లకు సకాలంలో డీఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి.
ప్రతీ 6నెలలకు ఒకసారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలి.కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లిం చాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారుచేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటిం చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
0 Comments