చప్పట్లతో వారికి అభినందనలు తెలిపిన సీఎం జగన్

చప్పట్లతో వారికి అభినందనలు తెలిపిన సీఎం జగన్

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి వారి సేవలను శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీలం సాహ్ని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటర్లకు అభినందనలు తెలిపారు.
చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం జగన్
మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని గతేడాది ఇదే రోజు గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అలాగే సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డు స్థాయిలోనే పొందేలా సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకే చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు.

Post a Comment

0 Comments