జగన్ సర్కార్ సంచలన నిర్ణయం...YSR ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు..

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం...YSR ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు..


 

ఏపీలో YS Jagan ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల కోసం గతవారమే ప్రారంభించిన YSR ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం అందించే ప్రోత్సహాకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల ప్రోత్సాహకాన్ని రూ.5 వేలకు పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక సిజేరియన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. దీనికి సంబంధించి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఆస్పత్రుల సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అన్నీ నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని  సీఎం జగన్ సూచించారు.

Post a Comment

0 Comments