దేశ వ్యవసాయ చరిత్రలో శుభదినం...ప్రధాని మోదీ వ్యాఖ్య

దేశ వ్యవసాయ చరిత్రలో శుభదినం...ప్రధాని మోదీ వ్యాఖ్య

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన రెండు కీలక వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇది శుభదినమని అభివర్ణించారు. లోక్‌సభ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందడం తెలిసిందే. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటింగ్ ద్వారా బిల్లులు సభామోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించారు. కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్, జేడీఎస్ సహా 14 పార్టీలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వైసీపీ తదితర పార్టీలు ఈ బిల్లులకు రాజ్యసభలో మద్దతు తెలిపాయి.ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదంతో దేశంలో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు.



Post a Comment

0 Comments