
బిగ్ బాస్ రియాలిటీ షో.. చాలామంది లైఫ్‌ని టర్న్ చేయడమే కాదు.. ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీల జీవితాలు తలకిందులయ్యాయి. బిగ్ బాస్‌లోకి వచ్చి మంచి ఇమేజ్‌ని సంపాదించిన వాళ్లు కొందరైతే.. ఈ షోద్వారా ఇమేజ్‌కి డ్యామేజ్ చేసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో దర్శకుడు సూర్య కిరణ్ చేరారు.
‘సత్యం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించిన సూర్య కిరణ్.. ఆ తరువాత కొన్ని సినిమాలను చేసి వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరయ్యారు. ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తరువాత తిరిగి బిగ్ బాస్ షోతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తొలి వారంలోనే ఇంటి ముఖం పట్టారు. దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన సూర్యకిరణ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మాత్రం ప్రేక్షకుల్ని అలరించడం మాట అటుంచితే ఆయనపై బ్యాడ్ ఒపీనియన్ కలిగేలా ప్రవర్తించారు. హౌస్‌లో జరిగిన అసలు వాస్తవాలు ఏంటన్నది తెలియదు కాని.. టెలికాస్ట్ అయిన గంటలో బిగ్ బాస్.. సూర్యకిరణ్‌ని అలాగే చూపించారు.
ఎప్పుడూ సిగరెట్ తాగుతూ కనిపిస్తూ.. అందరిపై కోప్పడుతూ.. పని చేయకుండా అందరి పనుల్లో వేలుపెడుతూ.. సూపర్ వైజర్‌లా వ్యవహరించారని చాలా కంప్లైంట్‌లు వచ్చాయి. సూర్య కిరణ ఎలమినేట్ కావడానికి కూడా ఇవే ప్రధాన కారణాలు.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను చెప్పుకొచ్చారు సూర్యకిరణ్.. అసలు హౌస్‌లో ఏం జరుగుతుంది?? తాను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చిందన్న విషయాలపై క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘తాడు పామై కరుస్తుందని అంటారు కదా.. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత నా పరిస్థితి అలా తయారైంది.. బ్యాడ్ టైం నడిచింది. నిజానికి నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి బలమైన కారణం ఉంది.. సత్యం సినిమా హిట్టైన తరువాత హైదరాబాద్‌లోనే ఉండి.. కొన్ని సినిమాలు చేశాను. అవి సరిగా ఆడకపోవడంతో పాటు.. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల తిరిగి చెన్నై వెళ్లాను. దాదాపు ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. మధ్యలో నేను చచ్చిపోయానంటూ కూడా వార్తలు వేశారు. మళ్లీ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వద్దాం అని అన్నీ రెడీ చేసుకున్నా.. ఉగాదికి షూటింగ్‌కి మొదలుపెట్టాలని అనుకుంటున్న టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నా ఎంట్రీకి ఇదో మంచి ప్లాట్ ఫామ్ అవుతుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నా.
0 Comments