పీఎం కిసాన్ నగదు ఏడాదికి రూ.12,000 చేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పీఎం కిసాన్ నగదు ఏడాదికి రూ.12,000 చేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

                         
 ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన-PM Kisan పథకం కింద రైతులకు ఏటా బదిలీ చేస్తున్న రూ.6,000 మొత్తాన్ని రూ.12,000 చేస్తారన్న ప్రచారాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఖండించారు.పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఇచ్చే నగదును పెంచే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. దీంతో పాటు ఇతర వాయిదాలను ముందే చెల్లిస్తారని వస్తున్న వార్తలపైనా స్పందించారు. 

ఈ ప్రతిపాదనలేవీ చేయట్లేదని లోక్‌సభకు వివరించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్ట్ వరకు రూ.38,282 కోట్లు నగదు బదిలీ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 14 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నగదు బదిలీ పద్ధతిలో రైతుల అకౌంట్‌లోకి నేరుగా డబ్బుల్ని జమ చేస్తోంది. 
అయితే ఇటీవల పీఎం కిసాన్ స్కీమ్ విషయంలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం నగదును రెట్టింపు చేస్తుందని, మిగతా విడత డబ్బుల్ని ముందే రైతుల అకౌంట్లోకి జమ చేస్తుందన్నది ఆ వార్తల సారాంశం. ఈ ప్రతిపాదనలు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments