జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మరణించారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. గుండెల నిండా తనపట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఇది మాటలకందని విషాదమని పేర్కొన్నారు జనసేనాని. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న ఆయన... వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను తానే ఆదుకుంటానని చెప్పారు పవన్ కల్యాణ్.
0 Comments