(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) 74వా స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ పతాక ఆవిష్కరించిన తెలంగాణ జన సమితి సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగ పలితమే మనకు స్వతంత్రం సిద్దించిందని అన్నారు. స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాల గడిచిన స్వాతంత్రం, స్వేచ్చ గురించి కోట్లాడిన బడుగు, బలహీన వర్గాలకు మాత్రం ఇప్పటివరకు సరైన స్వాతంత్రం రాలేదని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు బడుగుబలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, పేదవారికి తగు న్యాయం చేయ్యాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫేడరేషన్ ప్రధాన కార్యదర్శి దేవరాయ ఏల్లం, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గుడురి బాలరాజు తదితరులు పాల్గోన్నారు.
0 Comments