(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) పార్లమెంటు భవనం ప్రారంభించింది తెలుగువాడే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ఘనత ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి తెలంగాణ విప్లవ కెరటం రావి నారాయణరెడ్డి దక్కుతుందని వై ఎస్ ఆర్ సి పి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తడుక జగదీశ్వర్ గుప్త అన్నారు. అంతేకాకుండా దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 1952 లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి మూడు లక్షల ఎనిమిది వేల 162 ఓట్లు పొందారు. అలహాబాద్ కం జోన్ పూర్ పశ్చిమ సభ్య నియోజక వర్గము నుండి ఇ జవహార్ లాల్ నెహ్రూకు రెండు లక్షల 33 వేల 5 71 ఓట్లు పొందారు. దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన సభ్యులతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలనే అప్పట్లో నిర్ణయించారు. దాంతో నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించిన రవి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఢిల్లీలోని పార్లమెంటు భవనం ప్రారంభమైంది.
0 Comments