కామారెడ్డి (చట్టం) : వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం నసురుల్లాబాద్ గ్రామ శివారులోని సర్వాపూర్ హనుమాన్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు చేసి భజన కార్యక్రమాలు నిర్వహించే ఆనవాయితీగా కొనసాగుతుంది. అందులో భాగంగా నసురుల్లాబాద్ గ్రామస్తులు 11 హనుమాన్ మందిరాలకు పాదయాత్రగా వెళ్లి భజనలు చేస్తూ ప్రతి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగే సాయిలు, బోధనం సాయిలు, పెద్దకాపు అయినాల లచ్చయ్య, యాదరిగి గౌడ్, అరిగే మహేందర్, బాన్సువాడ విఠల్, శివప్రసాద్, గునిగెర మహేందర్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments