హైదరాబాద్ నుంచే కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్ వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్‌తో పాటు డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ ఉద్యోగులతో మంత్రి మాట్లాడారు.
సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరక్టర్ శక్తి నాగప్పన్‌తో కలిసి మంత్రి చర్చను నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజంలో ఉండడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందనే స్పష్టం చేశారు.
వ్యాక్సిన్స్ డెవలప్‌మెంట్, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో ఇండియా పార్టనర్‌షిప్ కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే చెబుతున్నట్లు ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడి నుంచి మూడో వంతు వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడం గర్వించదగ్గ అంశమని అన్నారు. నిపుణుల నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని మంత్రి వెల్లడించారు.
ఇదే మీటింగ్ లో మంత్రి కేటీఆర్ తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా పాల్గొన్నారు.

0 Comments