(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) సీపీఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు,గోదావరి లోయ ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ లింగన్నను పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసి సంవత్సరం పూర్తయింది. కామ్రేడ్ లింగన్న ప్రధమ వర్ధంతి సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీపార్టీ ఆధ్వర్యంలో లింగన్న చిత్రపటానికి పూల మాలలు వేసి ఆధ్వర్యంలో నివాళ్ళుర్పించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ పార్టీ నేత శ్రీకాంత్ మాట్లాడుతూ.. పీడిత,తాడిత, ఆదివాసీ ప్రజల పక్షాన పోరాడుతున్న కామ్రేడ్ లింగన్నను పోలీసులు, రాజ్యం కలసి బూటకపు ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపి బౌతికంగా ప్రజలకు దూరం చేశారు.కానీ అయిన పోరాట స్ఫూర్తి,ఆశయాలు నిరంతరం ప్రజల గుండె చప్పుల్లో స్పృశిస్తూనే ఉన్నాయని అన్నారు.ప్రజా నాయకులను చంపి,విప్లవ రాజకీయాలను అంతం చేస్తున్నాము అని పోలీసులు, పాలకులు ఎన్నో సంవత్సరాల నుండి భ్రమ పడుతున్నారు.అయిన ఇంకా విప్లవోద్యమలు అమరుల స్పూర్తితో విస్తరిస్తున్నాయని అన్నారు.లింగన్న ఆదివాసీ ప్రజల పక్షాన,పోడు భూములకొసం, ఈ దోపిడీ వ్యవస్థ మారాలని ప్రాణ త్యాగం చేసాడని కొనియాడారు.లింగన్న నేటి యువతకు ఆదర్శప్రాయుడని ,చిరస్మరణీయంగా ప్రజల్లో నిలిచిఉంటాడాని గుర్తుచేశారు.లింగన్న అందించిన స్పూర్తితో మరింత ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మహేందర్,విద్యానాథ్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments